చైనా డంపింగ్‌పై అరబిందో ఫార్మా ఫిర్యాదు
ఫార్మా పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్)లను చైనా డంప్ చేస్తోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ ఎదగడం లేదని హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్రంగా పరిశీలించి యాంటీ-డంపింగ్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్’ను కోరింది.ముడి ఔషధాలు, ఏపీఐలకు మన దేశం చైనాపై అధికంగా ఆధారపడుతోందని… దీన్ని నివారించేందుకు ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్ ఔషధాల పార్కులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. అయితే చైనా డంపింగ్ వల్ల పరిశ్రమ ఎదగడం లేదని పేర్కొంది.
డంపింగ్ ద్వావరా దేశీయ కంపెనీలు నష్టాల పాలు అయ్యేలా చేసి… పూర్తిగా తనపై ఆధారపడేలా చైనా ప్రయత్నిస్తోందని అరబిందో ఫార్మా పేర్కొంది.