ఏషియన్ పెయింట్స్ పనితీరు సూపర్
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏషియన్ పెయింట్స్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం మార్కెట్ అంచనాలను మించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 160 శాతం పెరిగి రూ. 568 కోట్లకు చేరింది. అలాగే కంపెనీ అమ్మకాలు 91 శాతం పెరిగి రూ. 5,585 కోట్లకు చేరాయి. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 33 శాతం తగ్గగా, ఆదాయం 16 శాతం క్షీణించింది. కంపెనీ అద్భుత పనితీరుతో ఏషియన్ పెయింట్స్ షేర్లు మంగళవారం ఇంట్రాడే ట్రేడ్‌లో బీఎస్సీలో ఏడు శాతం పెరిగి… రూ.3,178 ని తాకాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3 లక్షల కోట్లను దాటింది.