ఇంకెంత పతనం..?
మార్కెట్లో ట్రేడర్స్‌కు కాసుల పంట పండించిన షేర్లలో ఏషియన్ పెయింట్స్ ఒకటి. అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్న ఈ షేర్ ఇపుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ షేర్ రూ.2744 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో ఈ షేర్ రూ. 3100ను కూడా తాకింది. మార్కెట్ డల్‌గా ఉండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణం. ఆయిల్ పరిశ్రమకు క్రూడ్ ఆయిల్ కీలక ముడిపదార్థం. అలాగే దేశీయంగా కూడా ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ షేర్ భవిష్యత్ టార్గెట్ గురించి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఆశిష్ చతుర్ మెహతా మాట్లాడుతూ … ఈ షేర్ రూ. 2550 లేదా రూ. 2500ను కూడా తాకే అవకాశముందని అన్నారు. అప్పటి వరకు ఈ షేర్లో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ షేర్ మంచి వృద్ధి చూడాలంటే… ఈ షేర్ రూ.3000 దాటాల్సి ఉందని అంటున్నారు.