నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్ మినహా మిగిలిన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు అరశాతంకన్నా తక్కువే ఉన్నాయి. ఇక చైనా మార్కెట్లదీ అదే పరిస్థితి. నష్టాల్లో ఉన్న పరిమితమే. నిన్న ఏడు శాతంపైగా లాభపడిన హాంగ్‌సెంగ్ సూచీ ఇవాళ 1.86 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో ఉంది. నిన్న భారీగా పెరగడం ఒక కారణం కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం మరో కారణం కావొచ్చు.