ఆసియా మార్కెట్లలో భారీ నష్టాలు
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్ అరశాతంపైగా నష్టపోయింది. డాలర్ స్థిరంగా ఉంది. క్రూడ్ ఆయిల్ పతనం రాత్రి కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని కీలక మార్కెట్లు దాదాపు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ కావడంతో ఆందోళన కల్గించే అంశం. ఇతర చైనా మార్కెట్లు కూడా ఒక శాతం నష్టంతో ఉన్నాయి. జపాన్ నిక్కీ పరిస్థితి కూడా అంతే. ఒకట్రెండు మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. అవి నామ మాత్రంగానే ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. ఈ లెక్కన నిఫ్టి కూడా స్థిరంగా లేదా నష్టాలతో ప్రారంభం కానుంది.