ఆసియా గ్రీన్… యూరప్ రెడ్లో
ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్లో ముగిశాయి.. జపాన్ తప్ప. జపాన్ నిక్కీ ఇవాళ 0.88 శాతం నష్టంతో క్లోజ్కాగా… మిగిలిన ఆసియా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. చాలా వరకు మార్కెట్లు అర శాతం దాకా పెరిగాయి. మరోవైపు యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కాకపోతే నష్టాలు నామ మాత్రంగా ఉండటం విశేషం. అమెరికా మార్కెట్లు రాత్రి మిశ్రమంగా ముగిశాయి. పైగా లాభనష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ మాత్రం గ్రీన్లో ఉన్నాయి. మొహరం సందర్భంగా మనదేశంలో మార్కెట్లు పనిచేయలేదు. కమాడిటీ మార్కెట్లు ఉదయం సెషన్ సెలవు. సాయంత్రం నుంచి కమాడిటీ మార్కెట్లు పనిచేస్తాయి.