కొత్త వేరియంట్ గుబులు: ఆసియా మార్కెట్లు విలవిల
హాంగ్‌కాంగ్‌తో పాటు దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ బయటపడిందన్న వార్తలతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లకు థ్యాంక్స్ గివింగ్ డే సెలువులు. అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. కొత్త వేరియంట్ కరోనా వైరస్‌కు సంబంధించి అనేక దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జపాన్ నిక్కీ అత్యధికంగా 2.4 శాతం నష్టపోయింది. ఇక హాంగ్‌కాంగ్ మార్కెట్లో కూడా 2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక కొరియా వంటి కీలక మార్కెట్లలో నష్టాలు ఒక శాతం పైనే ఉన్నాయి. తైవాన్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క చైనాలోనే నష్టాలు పరిమితంగా ఉన్నాయి. అన్ని ఆసియా దేశాలు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.