క్రూడ్ ధరను పెంచిన సౌదీ అరేబియా
చమురు ధరలు మళ్ళీ ఊపందుకుంటున్నారు. మొన్న 80 డాలర్లకు చేరిన బ్యారెల్ క్రూడ్ ధర ఇవాళ 83.81 డాలర్లకు చేరాయి. అంతర్జాతీయగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు చమురు సరఫరా పెంచరాదని ఒపెక్ దేశాలు నిర్ణయించడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి ఆసియా దేశాలకు అమ్మే ముడి చమురు ధరను సౌదీ అరేబియా కంపెనీ ఆరామ్కో పెంచింది. డిసెంబర్ డెలివరీకి ఉద్దేశించిన క్రూడ్ ధరను బ్యారెల్కు 2.70 డాలర్లు చొప్పున పెంచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా క్రూడ్ భారీగా పెరిగింది. మరోవైపు డాలర్ కూడా పెరుగుతుండటంతో భారత్ వంటి దేశాలపై భారం పెరగనుంది.