అదే ఫోన్.. రూ.50,000 తేడా
యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ మన దేశంలో కన్నా అమెరికాలో చౌకగా లభిస్తోంది. సౌదీ అరేబియాలో కూడా ఇదే ఫోన్ మన కన్నా తక్కువ ధరకు లభించడం విశేషం. ఐఫోన్ 14 సిరీస్ 128 జీబీ ధర అమెరికాలో 999 డాలర్లకు అంటే రూ.79,600లకు వస్తోందన్నమాట. అదే సౌదీ ఇదే ఫోన్‌ను 4299 రియాల్స్‌కు అమ్ముతున్నారు. మన కరెన్సీలో అక్కడ కొంటే రూ. 93,300లకు వస్తోంది. అదే 128 జీబీ ఫోన్ మన దేశంలో రూ. 1,29,900అకు యాపిల్ అమ్ముతోంది. అంటే అమెరికాకు, మన మార్కెట్‌కు అదే ఫోన్ ధరలో తేడా రూ. 50,000 అన్నమాట. సో.. అమెరికాకు వెళ్ళి వచ్చేవారు ఐఫోన్‌ను అక్కడే కొనడం బెటర్ అన్నమాట.