5జీ టెక్నాలజీతో బడ్జెట్ ఫోన్
టెక్ దిగ్గజం యాపిల్ నిన్న ఐఫోన్ ఎస్ఈ 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. 5 జీ టెక్నాలజీతో పనిచేయనున్న ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇదే. 429 డాలర్లకు ఈ ఫోన్‌ను అందిస్తున్నట్లు యాపిల్ రాత్రి ప్రకటించింది. గత వెర్షన్‌తో పోలిస్తే ఫోన్ ధర 8 శాతం పెరిగింది. మార్చి 18వ తేదీ నుంచి స్టోర్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. శుక్రవారం నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. భారత్‌లో ప్రారంభ ధర రూ .43,900గా ఉండొచ్చని చెబుతున్నారు. యాపిల్ ఏ 15 బయోనిక్ చిప్ కలిగిన ఐఫోన్ ఎస్ఈలో 4.7 అంగుళాల స్క్రీన్, ఎక్కువ సేపు పనిచేసే బ్యాటరీతో వస్తోంది. సెల్ఫీల కోసం 12 ఎంపీ ముందు కెమెరా ఉంది. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్… ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో లభించనంది.
https://www.youtube.com/watch?v=IYcF3gYSTEg