నిఫ్టిలోకి అపోలో హాస్పిటల్స్
మార్చి 31 నుంచి నిఫ్టీ 50 సూచీ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్థానంలో అపోలో హాస్పిటల్స్ రానుది. నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలోనూ మార్పులు జరుగుతాయని ఎన్ఎస్ఈ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్ – కమిటీ ఈక్విటీ (ఐఎంఎస్ఈ ) వెల్లడించింది. పేటీఎం మాతృ సంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్, ఎఫ్ఎస్ఎన్ ఇ – కామర్స్ వెంచర్స్ (నైకా), జొమాటో, ఐఓసీ, మిండ్ర, ఎస్ఆర్ఆఫ్ నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలోకి రాబోతున్నాయి . అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్, అరబిందో ఫార్మా, హెచ్పీసీఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎస్ బ్యాంక్ షేర్లను ఈ సూచీ నుంచి తప్పించనున్నారు . ఈ మార్పులన్నీ మార్చి 31 నుంచి (మార్చి 30 ముగింపు తర్వాత ) అమల్లోకి వస్తాయని ఎన్ఎస్ఈ పేర్కొంది.