అపోలో హాస్పిటల్స్ ఫలితాలు సూపర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన మూడునెలల్లో అపోలో హాస్పిటల్ చక్కటి పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 228 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 130 కోట్లతో పోలిస్తే ఈసారి 75 శాతం వృద్ధి సాధించినట్లయింది. కంపెనీ ఆదాయం కూడా 32 శాతం పెరిగి రూ. 2,760 కోట్ల నుంచి రూ. 3639 కోట్లకు చేరింది. అపోలో హాస్పిటల్స్ EBITDA కూడా 50 శాతం పెరిగి రూ. 587 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికంలో నాన్ కోవిడ్ వ్యాపారం బాగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగం నుంచి ఆదాయం 24 శాతం పెరిగి రూ. 1539 కోట్లకు చేరింది. నాన్ కోవిడ్ సర్జరీలు 53 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. అపోలో హాస్పిటల్స్‌కు 7860 బెడ్స్‌ను ఆపరేట్ చేస్తోంది.