మద్యం ఆదాయంలో రికార్డు
మద్య నిషేధం స్లోగన్‌తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022-23 ఏడాదిలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.16,500 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరవత రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయం రూ. 6914 కోట్లు కాగా, 2020-21లో ఇది రూ. 11,575 కోట్లకు పెరిగింది. కరోనా మహమ్మారి స్వైర విమారం చేసిన 2021-22 ఏడాదిలో కూడా రూ. 14500 కోట్లు మద్యం ఆదాయం వస్తుందని ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. 2022-23 ఏడాదిలో రూ. 16,500 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఎక్సైజ్ సహా ఇతర విభాగాల నుంచి ఆదాయం రూ. 57,709 కోట్ల నుంచి రూ. 91,049 కోట్లకు పెరగనుంది.