ఈడీ ఎదుట అనిల్ అంబానీ
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ తాజాగా నమోదైన కేసులో ఆయన స్టేట్మెంట్ను ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం పది గంటలకు ముంబైలోని ఈడీ ఆఫీసు ఎదుట అనిల్ అంబానీ హాజరరయ్యారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అనిల్ అంబానీ తిరిగి వెళ్లిపోయారు. 2020లో కూఐడా ఈడీ ఆఫీసు ముందు మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ హాజరయ్యారు. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ అయిన రాణా కపూర్‌తో పాటు ఇతరులను కూడా అప్పట్లో ఈడీ ప్రశ్నించింది. సుమారు 420 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు అనిల్ అంబానీపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఐటీ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఐటీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.