ఏపీ బడ్జెట్ కూడా రూ. 2.56 లక్షల కోట్లు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,56,256 కోట్లు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. (మొన్న ప్రవేశ పెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2,56,958 కోట్లతో పోలిస్తే ఏపీ బడ్జెట్ రూ. 702 కోట్లు తక్కువ.) ఏపీ ప్రభుత్వం 22-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 47,996 కోట్లుగా పేర్కొంది. దీంతో
రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు,
ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లగా తేలింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.
వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ.18వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా : రూ.3,900 కోట్లు
జగనన్న విద్యాదీవెన: రూ.2400 కోట్లు
జగనన్న వసతిదీవెన: రూ.2,083 కోట్లు
వైఎస్సార్ పీఎం ఫసల్ భీమా యోజన: రూ.1.802 కోట్లు
ఈబీసీ నేస్తం: రూ.590 కోట్లు
వైఎస్సార్ ఆసరా: రూ.6400 కోట్లు
వైఎస్సార్ చేయూత: రూ.4,235.95 కోట్లు
జగనన్న అమ్మ ఒడి: రూ.6500 కోట్లు
కాపు నేస్తం పథకాని: రూ.500 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర: రూ.260 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం: రూ.199.99 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా: రూ.120.49 కోట్లు
ఆర్థిక సేవల రంగాని: రూ.69,306 కోట్లు
వ్యవసాయం: రూ.11,387.69 కోట్లు
పశుసంవర్ధకం: రూ.1,568.83 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.20,962.06
విద్యుత్: రూ.10,281.04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్: రూ.27,706.66 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్: రూ.11,482 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ.17,109 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.685 కోట్లు
ట్రాన్స్పోర్ట్: రూ.9,617 కోట్లు కేటాయింపు
పర్యావరణ, అటవీ: రూ.685.36 కోట్లు
ఉన్నత విద్య: రూ.2,014.30 కోట్లు
పౌరసరఫరాలు: రూ.3,719.24 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు: రూ.10,201.60 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ : రూ.18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్: రూ.6,145 కోట్లు
బీసీ సబ్ ప్లాన్: రూ.29,143 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్: రూ.3,532 కోట్లు
ఈబీసీల సంక్షేమం: రూ.6,639 కోట్లు కేటాయింపు
వ్యవసాయ అనుబంధ రంగాలు: రూ.13,630 కోట్లు
రవాణా శాఖ: రూ.9,617 కోట్లు
పరిశ్రమలు, ఖనిజాభివృద్ధి: రూ.2,755 కోట్లు
సాగునీరు, వరద నివారణ: రూ.11,482 కోట్లు
శాస్త్ర సాంకేతికతకు, పర్యావరణం: రూ.11.78 కోట్లు
వైద్య రంగాని: రూ.15,384 కోట్లు
సాధారణ విద్య: రూ.30,077 కోట్లు
కళలు, సంస్కృతులకు: రూ.20.67కోట్లు
హౌసింగ్: రూ.4,791 కోట్లు
కార్మిక, ఉపాధి: రూ.1,033 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమం: రూ.4,331 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులు: రూ.140 కోట్లు
సాంకేతిక విద్య: రూ.413 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ.8,796 కోట్లు
తాగునీరు పారిశుధ్యం: రూ.2,133 కోట్లు
సంక్షేమ పథకాలు: రూ.45,955 కోట్లు
సాధారణ సర్వీసులు: రూ.73,609 కోట్లు
ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్: రూ.113 కోట్లు
రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్: రూ.3,088 కోట్లు
కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్: రూ.1,899 కోట్లు
ఫైనాన్స్: రూ.58,538 కోట్లు
జీఏడీ: రూ.998 కోట్లు
సచివాలయ వ్యవస్థ: రూ.3,396 కోట్లు
సోషల్ వెల్ఫేర్: రూ.12,728 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ: రూ.8,581 కోట్లు
క్రీడా శాఖ: రూ.290 కోట్లు
హోంశాఖ: రూ.7,586 కోట్లు
కార్మిక శాఖ: రూ.790 కోట్లు
న్యాయశాఖ రూ.924 కోట్లు
మున్సిపల్ శాఖ: రూ.8,796 కోట్లు
మైనార్టీ శాఖ: రూ.2,063 కోట్లు
ఐటీ శాఖ: రూ.212 కోట్లు