For Money

Business News

ఆమి ఆర్గానిక్స్‌ లిస్టింగ్‌… అదుర్స్‌

హైదరాబాద్‌ కంపెనీ విజయా డయాగ్నస్టిక్స్‌ లిస్టింగ్‌ నిరాశ కల్గించగా… ఇవాళే లిస్టయిన ఆమి ఆర్గానిక్స్‌ సూపర్‌ లాభాలు అందించింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌ను రూ. 610లకు ఆఫర్‌ చేయగా… ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 910 వద్ద లిస్టయింది. అంటే దాదాపు 50 శాతం లాభం ఇచ్చిందన్నమాట. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ళ మద్దతు అందడంతో 948.90 దాకా వెళ్ళింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 937 వద్ద ట్రేడవుతోంది. స్పెషాలిటి కెమికల్స్‌ తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో ఇష్యూ 64 రెట్లు ఓవర్‌ సబ్‌ స్క్రయిబ్‌ అయింది.