అదానీ సంస్థకు 47.74 కోట్ల వారంట్లు
అదానీ కుటుంబానికి చెందిన హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కు అంబుజా సిమెంట్స్ 47.74 కోట్ల వార్లంటను జారీ చేసింది. ఒక్కోవారంటు ధర రూ. 417.87 కాగా.. వెంటనే 25 శాతం మొత్తం చెల్లించేలా కేటాయించింది. ఈ కేటాయింపుతో కంపెనీ రూ. 5000 కోట్లను సమీకరించింది. మిగిలిన మొత్తాన్ని వారంట్లు షేర్లుగా మార్చుకునే సమయంలో చెల్లిస్తారు. ఇటీవల జరిగిన ఏజీఏంలో రూ.20,000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఇపుడు అదానీ కుటుంబానికి చెందిన సంస్థకు రూ.20,001 కోట్ల విలువైన వారంట్లను జారీ చేశారు. ఇపుడు రూ.5000 కోట్లు, షేర్ల జారీ సమయంలో మిగిలిన మొత్తాన్ని అదానీ కుటుంబ సంస్థ చెల్లిస్తుంది.