అంబుజా సిమెంట్ పర్లేదు
సిమెంట్ పరిశ్రమ డల్‌గా అంబుజా సిమెంట్ మంచి పనితీరు కనబర్చింది. గత మార్చితో ముగిసిన మూడు నెలలో కంపెనీ నికర లాభం తగ్గినా… మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థకు 495.2 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.664.6 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అయితే మార్కెట్ విశ్లేషకులు కంపెనీ రూ. 404 కోట్ల నికర లాభం అంచనా వేశారు. కంపెనీ ఆదాయం 8.4 శాతం పెరిగి రూ. 3906 కోట్ల నుంచి రూ. 3925 కోట్లకు చేరింది.