ఎయిర్ టెల్ చేతికి డిష్ టీవీ?
డీటీహెచ్ కంపెనీ డిష్ టీవీని టేకోవర్ చేసేందుకు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో స్టాక్ మార్కెట్లో డిష్ టీవీ షేర్ 5 శాతం అప్పర్ సీలింగ్ వద్ద ముగిసింది. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని మింట్ పత్రిక రాసింది. అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ (ఈవై) ఇప్పటికే డిష్ టీవీ బ్యాలెన్స్ షీట్ల మదింపు పూర్తి చేసినట్లు సమాచారం. అక్టోబర్ 25 నాటికే ఈ సంస్థ తన నివేదికను ఎయిర్టెల్కు ఇచ్చినట్లు తెలుస్తోంది.