ఎయిర్‌లైన్స్ నష్టాలు…రూ.15 లక్షల కోట్లపైనే
కరోనా సంక్షోభం ప్రపంచ విమాన కారాణంగా 2020-22 మధ్య కాలంలో ప్రపంచ ఎయిర్‌లైన్ కంపెనీలు భారీగా నష్టతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఈ రెండేళ్ళలో కంపెనీలు దాదాపు 20,100 కోట్ల డాలర్ల (రూ.15.07 లక్షల కోట్లు) మేర నష్టపోయే అవకాశముందని ఈ సంస్థ అంటోంది. 2023లో విమానయాన రంగం లాభాల బాటలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. కరోనా సంక్షోభ తీవ్రత తగ్గుతున్నా.. ఈ కంపెనీలకు కష్టాలు తప్పవని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అన్నారు.
భారత్‌లో గత ఏడాది మార్చి 23న విమానయాన సేవలు ఆపేశారు. కరోనా తీవ్రత తగ్గాక దేశీయ సేవలకు అనుమతి ఇచ్చినా.. అంతర్జాతీయ సేవలను ఇంకా అనుమతించలేదు.