ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి
కొత్తగా వచ్చే అన్ని కార్లలోనూ మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. పైగా అన్ని రకాల కార్లలో ఈ నిబంధన అమలు చేయాలని భావిస్తోంది. 2022 జనవరి 1 నుంచి అన్ని ప్రస్తుత కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరి చేశారు. వెనుక కూర్చున్న వారికీ భద్రత కల్పించేలా మరో 4 ఎయిర్ బ్యాగ్‌లు కూడా (మొత్తం 6 అవుతాయి) తప్పనిసరి చేయాలన్నది ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదనంగా 4 ఎయిర్‌బ్యాగ్‌లను కార్లలో ఏర్పాటు చేయడానికి రూ.8500 వరకు ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా కారు కొనేవారికి ఇది పెద్ద మొత్తం కాదని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీల నుంచి స్పందన తెలుసుకున్నాక ఈ నిబంధనను అమలు చేయాలనుకుంటోంది.