For Money

Business News

ఎయిర్‌ సువిధ తొలగింపు.. కరోనా టెస్ట్‌ అక్కర్లేదు

భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు ఎయిర్‌ సువిధ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది సెల్ఫ్‌ డిక్లరేషన్ ఫామ్‌. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. అలాగే ఇక నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణీకులు విమానం ఎక్కే ముందు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలన్న నిబంధనను కూడా ఎత్తేశారు. ఈ పరీక్షలు మనదేశంలో కన్నా ఇతర దేశాల్లో చాలా ఖరీదు, మాల్దీవుల్లో కరోనా పరీక్ష కోసం రూ. 7000 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి కరోనా వ్యాక్సిన్‌ వేసుకోకున్నా భారత్‌కు రావొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే కరోనా లక్షణాలు ఉంటే మాత్రం అధికారులు వెంటనే వారిని ఐసోలేట్‌ చేసి.. సంబంధిత హాస్పిటల్‌కు తరలిస్తారు. అలాగే ఒకసారి దేశంలోకి ప్రవేశించిన తరవాత తమ ఆరోగ్యం గురించి ప్రయాణీకులే పట్టించుకోవాల్సి ఉంటుంది.