For Money

Business News

రేపు ఏజీఎస్‌ లిస్టింగ్‌… లాభమా? నష్టమా?

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 లిస్ట్‌ అవ్వాల్సింది. ఒక రోజు ముందుగానే కంపెనీ షేర్లు లిస్ట్‌ అవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మన మార్కెట్లు కూడా రేపు లాభాల్లో ట్రేడయ్యే అవకాశాలున్నాయి. మరి ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ షేర్లు లాభాల్లో లిస్ట్‌ అవుతాయా? లాభాలు వచ్చినా చివరి వరకు ఉంటాయా అన్న టెన్షన్‌ నెలకొంది. ఎందుకంటే ఇటీవల లిస్టయిన చాలా షేర్లు దెబ్బతిన్నాయి. పైగా మొన్నటి దాకా ఈ షేర్‌ గ్రే మార్కెట్‌లో రూ.45 దాకా ఉన్న ప్రీమియం కాస్త పూర్తిగా కరిగిపోయింది. కంపెనీ షేర్లను రూ.175లకు ఆఫర్‌ చేసింది. మరి రేపు ఏ ధర వద్ద లిస్టవుతుందో చూడాలి.