తొలిరోజే అదానీ విల్మర్ దూసుడు
లిస్టింగ్ రోజే అదానీ విల్మర్ దూసుకుడు ప్రదర్శించింది. ఓపెనింగ్‌లో నష్టాలతో ప్రారంభమైన ఈ షేర్ క్లోజింగ్ కల్లా ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. పబ్లిక్ ఆఫర్ ధర రూ.230 కాగా… ఓపెనింగ్‌లో రూ. 227 వద్ద ప్రారంభమైంది. అక్కడ నుంచి సెషన్ కొనసాగే కొద్దీ బలపడుతూ వచ్చింది. ఎక్కడా తగ్గలేదు.. అలాగేని ఒక్కసారిగా పెరగలేదు. క్రమంగా పెరుగుతూ వచ్చి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి రూ. 271.25ని తాకింది. క్లోజింగ్‌లో స్వల్పంగా తగ్గి రూ. 267.35 వద్ద ముగిసింది. తొలి రోజు డెలివరీ వ్యాల్యూమ్ 47 శాతం ఉండటం విశేషం.