For Money

Business News

అదానీ విల్మర్‌ జూమ్‌

నిన్న లిస్టయిన అదానీ విల్మర్‌ షేర్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. మార్కెట్‌ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ఇవాళ కూడా షేర్‌ 8 శాతం పెరిగి రూ. 290.70కి చేరింది. ఈ షేర్‌ను కంపెనీ రూ. 230కి అలాట్‌ చేయగా…ఈ షేర్‌ రూ. 227 వద్ద లిస్టయింది. కాని నిన్ననే 8 శాతం పైగా పెరిగిన అదానీ విల్మర్‌ షేర్‌ ఇవాళ మరో 8 శాతం పెరిగింది. ఈ ధర వద్ద కూడా ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగుతోంది.