For Money

Business News

స్విస్‌లో అదానీ ఆస్తులు జప్తు?

అదానీ గ్రూప్‌ మరో వివాదంలో ఇరుక్కుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన సమారు 31 కోట్ల డాలర్ల అంటే రూ. 2,600 కోట్ల ఆస్తులను స్విట్జర్‌ల్యాండ్‌ అధికారులు జప్తు చేసినట్లు స్విస్‌కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. తమ సొంత నిధులను వివిధ బినామీ కంపెనీల ద్వారా భారత్‌కు అదానీ కంపెనీలు తరలించాయని.. స్విస్‌ అధికారులు గుర్తించినట్లు ఈ వెబ్‌సైట్‌ రాసింది. స్థానిక క్రిమినల్‌ కోర్టులోని రికార్డుల ఆధారంగా ఈ వివరాలు బయటపడినట్లు గోథమ్‌ సిటీ అనే మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ దర్యాప్తు 2021లో జరిగినట్లు వెల్లడించింది. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌, మారుతీ, బెర్ముడా వంటి ట్యాక్స్ హావెన్స్‌లో బోగస్‌ కంపెనీలను అదానీ ఏర్పాటు చేసినట్లు గోథమ్‌ సిటీ వెల్లడించింది. ఈ వెబ్‌సైట్‌ వార్తలోని అంశాలను హిండెన్‌బర్గ్‌ రీసెర్చి ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వార్త ఇపుడు కార్పొరేట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Leave a Reply