భారతపై అక్కసుతోనే నివేదిక
భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ స్పందిస్తూ 413 పేజీల వివరణ ఇచ్చింది. తనకు నచ్చినవిధంగా తప్పుడు సమాచారాన్ని చేర్చి నివేదికన హిండెన్‌బర్గ్ రూపొందించిందని అదానీ ఆరోపించింది. పైగా తమ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ప్రారంభానికి ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనక హిండెన్‌బర్గ్ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఎటువంటి పరిశోధన చేయకుండానే ఈ నివేదికను హిండెన్‌బర్గ్ విడుదల చేసిందని పేర్కొంది. హిండెన్‌బర్గ్ ప్రస్తావించిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు అదానీ గ్రూపు కంపెనీలు ఇది వరకే వెల్లడించాయని అదానీ గ్రూపు పేర్కొంది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని కాగా, మిగిలిన 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని అదానీ వివరించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ విజయవంతం అవుతుందన్న ఆశాభావాన్ని అదానీ గ్రూపు వ్యక్తం చేసింది.