అదానీ విల్మర్ … లాభాల్లోకి
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ విల్మర్ లిమిటెడ్ షేర్ ఇవాళ డిస్కౌంట్లో లిస్టయింది. అయితే కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. రూ.230లకు షేర్లను కంపెనీ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయగా… రూ.227 వద్ద షేర్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయింది. తరవాత లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ షేర్ రూ.249.50ని తాకింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే 8 శాతంపైగా లాభపడింది. గ్రే మార్కెట్లో ఈ షేర్ రూ.15 ప్రీమియంతో ట్రేడైంది. ఒకవేళ మార్కెట్ బలపడితే రూ. 260ని దాటే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. లేదంటే నామ మాత్రపు లాభాలతో ముగిసే అవకాశముంది.