For Money

Business News

నిఫ్టికి అదానీ దెబ్బ

మిడ్‌ సెషన్‌లో ఊహించినట్లే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి 17663ని తాకింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి ఇపుడు 17736 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 80 పాయింట్లు నష్టంతో ఉంది. ఇతర అన్ని సూచీల నష్టాలు అర శాతం లోపే ఉన్నా… నిఫ్టినెక్ట్స్‌ మాత్రం ఒక శాతంపైగా నష్టంతో ఉంది. అదానీ గ్రూప్‌నకు చెందిన అనేక షేర్లలో అమ్మకాల ఒత్తిడి రావడమే దీనికి కారణం. ఏసీసీ, అంబుజా సిమెంట్‌లలో తనకు ఉన్న మొత్తం వాటాను అదానీ గ్రూప్‌ తాకట్టు పెట్టింది. దీంతో ఏసీసీ ఆరు శాతం, అంబుజా సిమెంట్‌ షేర్‌ 5 శాతం నష్టపోయింది. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్‌ కూడా నాలుగు శాతంపైగా క్షీణించింది. అయితే ఎఫ్‌ఎంసీజీ షేర్లలో మంచి ర్యాలీ వచ్చింది.ఈ రంగానికి చెందిన దాదాపు అన్ని ప్రధాన షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలు గడించాయి.