యాక్సెంచర్ ఫలితాలు…సూపర్
స్టాక్ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్సెంచర్ ఫలితాలు వచ్చేశాయి. కొత్త త్రైమాసికంలో వచ్చిన తాజా ఫలితాలు ఇవి. కంపెనీ ఫలితాలు మార్కెట్ అంచనాలను మించడమేగాక… భవిష్యత్ అంచనాలను పెంచింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలను వెల్లడించింది.ఈ కంపెనీ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో మొదలై ఆగస్టుతో ముగుస్తుంది. అంటే జనవరితో తొలి త్రైమాసికం పూర్తి కాగా, మార్చితో రెండో త్రైమాసికం పూర్తవుతుంది. రెండో త్రైమాసికంలో కంపెనీ 1505 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 1,209 కోట్ల డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 24 శాతం పెరిగింది. కంపెనీ గైడెన్స్ కన్నా 30 కోట్ల డాలర్లు అధికం. పూర్తి ఏడాదికి కంపెనీ 19-22 శాతం వృద్ధిరేటు సాధించవచ్చని ఇది వరలో ప్రకటించింది. ఇపుడు దీన్ని సవరిస్తూ వృద్ధి రేటు 24 శాతం నుంచి 26 శాతం ఉండొచ్చని వెల్లడించింది. అలాగే… ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం కంపెనీ పనితీరుపై ఉండొచ్చని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ కంపెనీలో 7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.