వాల్‌స్ట్రీట్ జూమ్…
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెస్లా, అమెజాన్, యాపిల్, ఏఎండీ షేర్లు భారీ లాభాలు గడించాయి. ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో వాల్‌మార్ట్ దాదాపు 12 శాతం నష్టపోయింది. పదేళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ 3 శాతానికి దగ్గరవుతున్నా మార్కెట్ ఆకర్షణీయ లాభాలతో ముగియడం విశేషం.యాపిల్ రీటైల్ సేల్స్ బాగుంటాయని అనలిస్టలు అంటున్నారు. నిన్న భారీ కొనుగోళ్ళ వెనుక ప్రధాన కారణం.. చాలా షేర్లు 30 శాతంపైగా క్షీణించడమేనని అనలిస్టలు అంటున్నారు. పెద్ పెద్ద కంపెనీల షేర్లు 50 శాతం దాకా పడినవి కొన్ని ఉన్నాయని వీరు అంటున్నారు. మార్కెట్లో కరెక్షన్ వచ్చిందా లేదా బేర్ మార్కెట్లో ఉన్నామా అన్న అనుమానం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు డాలర్ స్వల్పంగా నష్టాల్లో ఉంది. అయినా డాలర్ ఇండెక్స్ 103పైన కొనసాగుతోంది. బులియన్ మాత్రం డల్‌గా ఉంది. ఔన్స్ బంగారం ధర 1800 డాలర్ల ప్రాంతంలో ఉంది.