ఇవాళా ఈక్విటీల దూకుడు
ఇవాళ వాల్‌స్ట్రీట్ చాలా గ్రీన్‌గా ఉంది. బాండ్ ఈల్డ్స్ పెరిగినా.. డాలర్ బలహీనపడటం ఈక్విటీలకు కలిసి వచ్చింది. ఇవాళ బ్యాంకు షేర్లలో గట్టి ర్యాలీ కొనసాగుతోంది. నాస్డాక్ దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతుంటే… ఎస్ అండ్ పీ 500 కూడా ఒకటిన్నర శాతం వరకు లాభంతో ఉంది. ఇక డౌజోన్స్ 0.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 105 అవుతుందని అనుకుంటున్న సమయంలో వెనక్కి తగ్గింది. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ రెండున్నర శాతం పెరిగినా.. 2.9 శాతం లోపే ఉంది. ఇక క్రూడ్ కూడా ఇవాళ స్థిరంగా ఉంది. ధరల్లో పెద్దగా మార్పు లేదు. బులియన్ కూడా స్థిరంగా ఉంది. వెండి కాస్త లాభాలతో ఉంది.