ఎయిరిండియాలో విస్తారా విలీనం!
ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. విస్తారాలో తన భాగస్వామి సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA)తో గ్రూప్ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలీనంపై నిర్ణయానికొచ్చేందుకు ఈ ఏడాది చివరి వరకు సమయం కావాలని SIA కోరినట్లు సమాచారం. ఈ డీల్ వచ్చే ఏడాదిలో పూర్తి అవుతుందని భావిస్తున్నారు. విస్తారాలో టాటా గ్రూప్ ప్రమోటింగ్ కంపెనీ టాటా సన్స్ 51 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 49 శాతం వాటా SIA చేతుల్లో ఉంది. ఇటీవల ఎయిరిండియాను టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తమ గ్రూప్‌నకు చెందిన మరో ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియాను కూడా ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. టాటా సన్స్, ఎస్‌ఐఏ ఈ ఏడాది ప్రారంభంలోనే విలీనంపై చర్చించాయి. మరోవైపు విస్తారా ఉద్యోగులకు కోవిడ్ మునుపటి నాటి
జీతాలు ఇవ్వడం ప్రారంభమైంది. పైలెట్స్‌కు ఇచ్చే ఇతర అలవెన్స్‌లను కూడా ఇస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నట్లు విస్తారా ప్రకటించింది.