గ్రోత్ స్టాక్స్ కూడా పడుతున్నాయి
ఇప్పటి వరకు భారీ నష్టాలు ఐటీ, టెక్ కంపెనీలకు పరిమితమయ్యాయి. బ్యాంకింగ్‌తోపాటు ఇతర గ్రోత్ స్టాక్స్‌లో పెద్ద అమ్మకాల హోరు ఉండేది కాదు. ఇపుడు గ్రోత్ షేర్స్ వంతు వచ్చినట్లుంది. ఇతర షేర్లతో పాటు గ్రోత్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. వరుసగా రెండో రోజు డౌజోన్స్ ఒకశాతంపైగా నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా ఇంతే నష్టంతో ఉంది. నాస్డాక్ కూడా 0.77 దాకా నష్టంతో ఉంది. యూరో మార్కెట్ షేర్లు నష్టాలు చాలా వరకు తగ్గాయి. అయినా.. చాలా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి.