For Money

Business News

16,000 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 15976 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 15998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 182 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 618 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి అత్యధికంగా 1.5 శాతం నష్టపోయింది. నిఫ్టిలో 46 షేర్లు నష్టపోయాయి. నిఫ్టిలో ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్ కాగా, బజాజ్‌ ఫైనాన్స్‌ మరో రెండు శాతం నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది.