For Money

Business News

రూ.20 లక్షలు దాటి డిపాజిట్‌ చేస్తే…

భారీ మొత్తంలో జరిగే లావాదేవీలపై కేంద్రం నిఘా వేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు, అంతకు మించి నగదును డిపాజిట్‌ చేస్తే పాన్‌ తోపాటు ఆధార్‌ కార్డు వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సస్‌ (CBDT) వెల్లడించింది. ఈ కొత్త నిబంధన ఈనెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే రూ. 20 లక్షలకు మించి విత్‌ డ్రా చేసిన ఈ వివరాలు అందజేయాల్సి ఉంటుంది. బ్యాంకులతోపాటు కో ఆపరేటివ్ బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీస్‌లలో చేసే డిపాజిట్లు, విత్‌ డ్రాయిల్స్‌ కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అలాగే బ్యాంకు లేదా కో ఆపరేటివ్‌ లేదా పోస్టాఫీసులో కరెంటు అకౌంట్‌, క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే కూడా పాన్‌ తోపాటు ఆధార్‌కార్డు తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకు పాన్‌, ఆధార్‌ నంబర్లు కేవలం ఐటీ విభాగానికి మాత్రమే అసెస్సీలు ఇస్తున్నారు.