నెట్‌ఫ్లిక్స్‌లో యాడ్స్ వచ్చేస్తున్నాయి
కొత్త సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య భారీగా తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో యాడ్స్‌తో సబ్స్క్రిప్షన్స్ ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఇపుడు యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతోసబ్స్క్రిప్షన్ ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో ధర తగ్గించి యాడ్స్‌తో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ సర్వీస్ రావడానికి చాలా సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే కొత్త సర్వీస్‌ను తీసుకువస్తున్నట్లు ద న్యూయర్క్ టైమ్స్ పత్రిక రాసింది. అలాగే పాస్‌వర్డ్‌ల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందని పత్రిక రాసింది.