చరిత్ర సృష్టించిన నిఫ్టి
ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఆల్ టైమ్ హైని తాకింది. జూన్ నెల డెరివేటివ్స్ సెన్సేషనల్ ప్రారంభాన్ని ఇచ్చింది. 70 శాతం రోల్ ఓవర్స్‌తో నిన్ననే మార్కెట్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిఫ్టి ఆల్‌టైమ్ హై 15,431 కాగా, ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 15,455ని తాకింది. దాదాపు అన్ని రంగాల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇటీవల బాగా తగ్గిన మెటల్స్ కూడా ఇవాళ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. అనేక షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటాయి. ఇవాళ ఐటీ సూచీ డల్‌గా ఉంది. ప్రస్తుతం నిఫ్టి 69పాయింట్ల లాభంతో 15444 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల్ రూ.1134
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ.703
ఓఎన్జీసీ రూ.114.75
హిందాల్కో రూ. 395.35
బీపీసీఎల్ రూ.474.95
నిఫ్టి టాప్ లూజర్స్
సన్ ఫార్మా రూ.678
డాక్టర్ రెడ్డీస్ రూ.5168
ఎం అండ్ ఎం రూ.818
బజాజ్ ఆటో రూ.4211
సిప్లా రూ. 934