For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓ: 2.95 రెట్ల స్పందన

ఎట్టకేలకు ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం కూడా పాతివేల బ్యాంకు బ్రాంచీలను పబ్లిక్‌ ఆఫర్‌ కోసం తెరిచి ఉంచిన ఇష్యూ ఇదే. ఊహించినట్లే క్యూఐబీ, ఎన్‌ఐఐ ఇన్వెస్టర్ల నుంచి చివరి రోజు సబ్‌స్క్రయిబ్‌ చేశారు. క్యూఐబీ కోటా 2.83 రెట్లు, ఎన్‌ఐఐ కోటా 2.91 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. కాని రికార్డు స్థాయి దరఖాస్తలు మాత్రం పాలసీదారుల నుంచి. ఈ కోటా 6.11 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇక రీటైల్‌ విభాగమే అన్నింటి కన్నా చాలా తక్కువగా స్పందన వచ్చింది. వీరికి కేటాయించిన షేర్లకు 1.99 రెట్లు మాత్రమే ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. పాలసీదారుల కోటా 4.4 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయింది. మొత్తాన్ని ఎల్‌ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 2.95 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ముగిసింది. ఆరు రోజుల పాటు ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) సబ్‌స్క్రిప్షన్ కొనసాగింది. ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగియడంతో ఇక ఇన్వెస్టర్ల చూపులన్నీ లిస్టింగ్ పైనే ఉన్నాయి.ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లు సేకరించేందుకు ఈ పబ్లిక్‌ ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇష్యూ మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ కావడంతో ఇక అలాట్‌మెంట్‌ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎల్ఐసీ ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడంతో ఇన్వెస్టర్లకు లాటరీ ద్వారా షేర్లను కేటాయిస్తారు. పాలసీహోల్డర్ కోటాలోనే పోటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ విభాగం 6.10 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన మొత్తంలో గ్రీన్‌ షూ ఆప్షన్‌ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఈ ఆప్షన్‌ వినియోగించేందుకు సెబి ఇదివరకే నిరాకరించినట్లు తెలుస్తోంది.