16,200 దిగువకు నిఫ్టి
సింగపూర్ నిఫ్టికన్నా ఎక్కువ నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీతో పాటు మెటల్స్, బ్యాంక్ షేర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,162 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 16183 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 228 పాయింట్లు నష్టపోయింది. 842 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 53982 పాయింట్ల వద్ద ట్రడవుతోంది. నిఫ్టిలో ఒక్క సిప్లా మినహా మిగిలిన 49 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా 5 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌లో టాప్‌లోఉంది. హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, టాటా మోటార్స్ నష్టాల్లో ముందున్నాయి. ముఖ్యంగా ఐటీ మిడ్ క్యాప్ షేర్లు బాగా నష్టపోతున్నాయి. విలీన ప్రతిపాదన తరవాత మైండ్‌ట్రీ ఇవాళ 5 శాతం దాకా నష్టపోయింది. ఇక మిడ్ క్యాప్‌లో నో గెయినర్స్. మొన్నటి దాకా ఇన్వెస్టర్ల డార్లింగ్‌గా ఉన్న టాటా పవర్ 7 శాతంపైగా నష్టంతో 228 ప్రాంతంలో ట్రేడవుతోంది.