ఎల్‌ఐసీ ఐపీఓ: 1.66 రెట్ల స్పందన
ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ డల్‌గానే ఉంది. మొత్తం ఇష్యూ 1.66 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. రేపు లేదా ఎల్లుండి భారీ దరఖాస్తులు వస్తున్నాయని ఎల్‌ఐసీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇవాళ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) కోటా పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది. ఇక ఉద్యోగులకు కేటాయించిన కోటా 3.54 రెట్లు సబ్ స్క్రయిబ్ కాగా, పాలసీదారుల కోటా 4.67 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. నిన్న బిడ్డింగ్ క్లోజింగ్ సమయానికి ఇష్యూ 1.38 రెట్లు, ఇవాళ బిడ్డింగ్ ముగిసే సమయానికి మొత్తం ఇష్యూ 1.66 రెట్లు స్పందన వచ్చింది. సాధారణంగా క్యూఐబీ కోటా ఇప్పటి వరకు 67 శాతం మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఈ కోటాకు భారీ స్పందన చివరి రోజున వస్తుంది.ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21000 కోట్లు సమీకరించనుంది.