16400…16000.. ఇంకా దిగువకు…
అమెరికా మార్కెట్ గ్రీన్‌గా ఉందని మురిపోవద్దని.. మన మార్కెట్ ట్రెండ్ తిరోగమనంలో ఉందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ.. ఇపుడు మార్కెట్ సెల్ ఆన్ ర్యాలీ అనే ఫార్ములాను ఇన్వెస్టర్లు పాటించడం మంచిదని ఆయన అన్నారు. నిఫ్టికి ఇప్పటి వరకు ఉన్న అన్ని మద్దతులు పోయాయని ఆయన అన్నారు. నిఫ్టి ఇక్కడి నుంచి 16400, ఆ తరవాత 16000కు పడే అవకాశముందని ఆయన అన్నారు. నిఫ్టి మరింత బలహీనపడే అంశాన్ని తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. అమెరికా మార్కెట్‌కు మన మార్కెట్ భిన్నంగా ఉంటుదని ఆయన అన్నారు. ఇక నుంచి పూర్తి షేర్ ఆధారిత ట్రేడింగ్ మంచిదని ఆయన సలహా ఇచ్చారు. మరో అనలిస్ట్ నితీష్ టక్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిఫ్టికి 16460 వద్ద మద్దతు అందుతుందేమో చూడాలని ఆయన అన్నారు.