ఫస్ట్ డే: 64 శాతం వచ్చేశాయి
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలిరోజే ఇష్యూలో 64 శాతం సబ్స్క్రయిబ్ అయింది. ఇందులో ఉద్యోగుల వాటా పూర్తిగా సబ్స్క్రయిబ్ కాగా, పాలసీదారులకు కేటాయించిన కోటా 1.87 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. ఇక రీటైల్ ఇన్వెస్టర్ల రిజర్వేషన్లో 57 శాతం వరకు దరఖాస్తులు వచ్చాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాకు సమానమైన షేర్లను ఆఫర్ చేస్తోంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో ఇవాళ 25 శాతం సబ్స్క్రయిబ్ అయింది. ఇక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు కేటాయించిన కోటాలో33 శాతానికి సమాన షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఇష్యూ 9వ తేదీన ముగుస్తుంది. పైగా శనివారం కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు.