స్థిరంగా ఈక్విటీ మార్కెట్లు
అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్నాయి. రాత్రి లాభనష్టాలతో ఊగిసలాడిన వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ముగిసింది. మూడు ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.48 శాతం లాభంతో క్లోజ్ కాగా, డౌజోన్స్, నాస్‌డాక్‌లు 0.22 శాతం లాభంతో ముగిశాయి. ఇవాళ రాత్రికి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుంది. ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ కామెంటరీ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. బాండ్ ఈల్డ్స్ గ్రీన్‌లో ఉన్నా… 3 శాతంలోపే ఉన్నాయి. ఇక డాలర్, క్రూడ్, బులియన్ మార్కెట్లన్నీ స్థిరంగా ఉన్నాయి.