For Money

Business News

కుప్పకూలిన అమెరికా మార్కెట్లు

నాస్‌డాక్‌ బేర్‌ మార్కెట్‌లో ప్రవేశించినట్లు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. అమెరికా కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం అమెజాన్‌ 14 శాతం, ఎన్‌విడా 6 శాతం.ఏఎండీ, యాపిల్‌, మైక్రోసాఫ్ట్ షేర్లు నాలుగు శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఫేస్‌బుక్‌ మరో మూడు శాతం క్షీణించింది. మార్కెట్‌లో భయానక వాతావరణం నెలకొంది. వాస్తవానికి అమెజాన్‌ కంపెనీ లాభాల్లోనే ఉంది. కాని ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కంపెనీలో పెట్టుబడి పోయింది. దీంతో కంపెనీ తొలిసారి నష్టాలను ప్రకటించింది. నాస్‌డాక్‌ 4శాతం పైగా నష్టపోయింది. ఏప్రిల్‌ నెలలో నాస్‌డాక్‌ 13.3 శాతం నష్టపోయింది. 2008 తరవాత నాస్‌డాక్‌ ఈ స్థాయిలో ఒక నెలలో పడటం ఇదే మొదటిసారి. టెక్‌, ఐటీ షేర్లు కూడా ఉండే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 3.6శాతం నష్టపోయింది. ఎకనామి షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్‌ కూడా 2.77 శాతం క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పరుస్తోంది. మే నెలలో సాధారణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయి.