రాణించిన ఎస్ బ్యాంక్
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3788 నికర నష్టం ప్రకటించిన బ్యాంక్ ఈ ఏడాది రూ. 367 కోట్ల నికర లాభం ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కూడా నికర లాభం 37.9 శాతం పెరిగింది. అలాగే గత ఏడాది చివరి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది నికర వడ్డీ ఆదాయం 84 శాతం పెరిగింది. రూ. 987 కోట్ల నుంచి రూ. 1819 కోట్లకు చేరింది. వడ్డీ యేతర ఆదాయం కూడా రూ. 689 కోట్ల నుంచి రూ. 882 కోట్లకు పెరిగింది. గత ఏడాది చివరి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 5113 కోట్లను ప్రావిజన్స్ కింద చూపాల్సి వస్తే.. 21-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 271 కోట్ల ప్రావిజన్స్ కోసం కేటాయించారు.