మళ్ళీ కీలక రంగాలు ఢమాల్
దేశంలోని ఎనిమిది రంగాల వృద్ధి రేటు మార్చి నెలలో తగ్గింది. ఫిబ్రవరిలో ఈ ఎనిమిది రంగాలు 5.8 శాతం చొప్పున అభివృద్ధి చెందగా, మార్చిలో 4.3 శాతానికి పడిపోయింది. వీటిలో మూడు రంగాలు బాగా రాణించడంతో ఆ మాత్రం వృద్ధి నమోదైంది. మార్చి నెలలో అత్యధికంగా ఎరువుల రంగం 15.3 శాతం చొప్పున వృద్ధి సాధించింది. విద్యుత్ 4.9 శాతం, సిమెంట్ 8.8 శాతం, నేచురల్ గ్యాస్ రంగం 7.6 శాతం వృద్ధి చెందినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. ముడి చమురు, బొగ్గు రంగాల్లో వృద్ధి తగ్గింది.