For Money

Business News

గట్టెక్కిన రెయిన్‌బో హాస్పిటల్‌ ఐపీఓ

అతి కష్టంగా హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో హాస్పిటల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. మూడో రోజు బొటాబొటిగా ఇష్యూ క్లోజ్‌ కానుంది. ఈ ఇష్యూకు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచే గాక కంపెనీ ఉద్యోగుల నుంచి కూడా పెద్ద స్పందన లేదు. రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగం కేవలం 97 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్‌ కాగా, ఉద్యోగులకు కేటాయించిన షేర్లలో కేవలం 19 శాతం మంది మాత్రమే బిడ్స్‌ వేశారు. ఇష్యూ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 2.05 కోట్ల షేర్లకు బిడ్స్‌ ఆహ్వానించగా 2.2 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. అంటే ఇష్యూ 1.08 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 88 శాతం లిస్ట్‌ అవగా, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి 1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1580 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 280 కోట్ల విలువైన కొత్త షేర్లు ఉన్నాయి. ఒక్కో షేర్‌ను రూ. 516-రూ. 542 రేటుకు కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.