For Money

Business News

NIFTY TRADE: 17004 తొలి మద్దతు

మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. క్యాష్‌ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్‌లో కూడా భారీగా అమ్ముతున్నారు. నిన్న క్యాష్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ. 4000 కోట్ల దాకా ఉంది. ఇదే స్థాయిలో ఫ్యూచర్స్‌లో అమ్మకాలు ఉన్నాయి. నిఫ్టి ఇవాళ 17000-17100 మధ్య క్లోజవుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. వచ్చేవారం కాంట్రాక్ట్‌లను దిగువస్థాయిలో కొనుగోలు చేయొచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ తెలిపాయి. నిఫ్టి 17047 లేదా 16957 వద్ద నిఫ్టికి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. పెరిగితే నిఫ్టికి 17107 లేదా 17161 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చని అన్నారు. ఇతర లెవల్స్‌ కోసం దిగువ వీడియోను చూడగలరు.

https://www.youtube.com/watch?v=C3iTpc149ZA