అయిదేళ్ళ గరిష్ఠానికి డాలర్
కరెన్సీ మార్కెట్లో యూరో, ఎన్ల బలహీనత కారణంగా డాలర్ అనూహ్యంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే గత 20 ఏళ్ళలో ఎన్నడూ చూడని స్థాయికి డాలర్ చేరే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. రాత్రి డాలర్ ఇండెక్స్ మరింత పెరిగి 103ని దాటింది. ఇది అయిదేళ్ళ గరిష్ఠ స్థాయి. 103.82ని దాటితే 2002 తరవాత ఇదే గరిష్ఠ స్థాయి అవుతుంది.
రూపాయి పరిస్థితి?
ముడి చమురు బిల్లు పెరగకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంక్ డాలర్‌తో రూపాయి పతనం కాకుండా ఆపుతోంది. మార్కెట్లో డాలర్లను అమ్ముతోంది. ఇప్పటికే డాలర్‌తో రూపాయి 80 దాటాల్సిందని కొందరు అనలిస్టులు అంటున్నారు. దేశీయ ద్రవ్యోల్బణం రీత్యా చూసినా డాలర్‌కు రూపాయి మారకం విలువ 85 ప్రాంతంలో ఉండాల్సిందని మరికొందరు అనలిస్టలు అంటున్నారు. ప్రభుత్వం ఇలా డాలర్‌తో రూపాయి బలహీనపడకుండా కాపాడటం వల్ల ఎగుమతి ప్రధాన పరిశ్రమలు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా కంపెనీలు దెబ్బతింటున్నాయి.